: నటిగా అవతారమెత్తిన వివాదాస్పద మాతాజీ రాధేమా


తన పొట్టి దుస్తులతో, నృత్యాలతో తీవ్ర వివాదాస్పదమైన మాతాజీ రాధేమా, తాజాగా నటిగా అవతారమెత్తింది. ఆమె ఓ వెబ్ సిరీస్ లో నటించనుంది. ‘నో క్యాస్టింగ్.. నో కౌచ్... ఓన్లీ ఔచ్?’ అనే పేరుతో ఈ సిరీస్ రూపొందుతుండగా, దీని షూటింగ్ ఆసాంతం ఆమె ఇంట్లోనే జరుగుతోంది. ఈ సిరీస్ లో రాధేమా తన నిజ జీవితంలోని పాత్రనే పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సిరీస్ ప్రసారమైతే, తనపై ఉన్న అనుమానాలు, విభేదాలు సమసిపోతాయని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక ఆమె కెమెరా ముందు ఏ మాత్రం బెరుకు లేకుండా నటిస్తోందని, ఎలాంటి శిక్షణ లేకుండా బాగా యాక్ట్ చేస్తోందని వెబ్ సిరీస్ నిర్మాత వ్యాఖ్యానించాడు. కాగా, గతంలో 'భక్తులు కోరారు.. నేను తీర్చాను' అంటూ విదేశాల్లో కురచ దుస్తులు వేసుకుని రాధేమా దర్శనమిచ్చిన ఫోటోలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News