: ఎయిర్ టెల్ నుంచి మరో బంపరాఫర్... పైసా అదనపు ఖర్చు లేకుండా డేటా స్పీడ్ లాభాలు రెట్టింపు


రిలయన్స్ జియోకు పోటీగా ఇప్పటికే పలు రకాల ఆఫర్లను ప్రకటించిన భారతీ ఎయిర్ టెల్, తాజాగా తన కస్టమర్లకు రెట్టింపు లాభాలను అందిస్తూ మరో బంపరాఫర్ ప్రకటించింది. వినియోగదారులు జియోవైపు మరలకుండా చూడటమే లక్ష్యంగా, ఒక్క పైసా అదనపు చెల్లింపులు లేకుండా బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల్లో డేటా ప్రయోజనాలను 100 శాతం వరకూ పెంచింది. రూ. 899 కింద అందిస్తున్న ప్లాన్ లో ఇప్పటివరకూ 30 జీబీ హైస్పీడ్ డేటాను అందిస్తున్న ఎయిర్ టెల్ దాన్ని 60 జీబీకి పెంచుతున్నట్టు ప్రకటించింది.

ఇదే సమయంలో రూ. 1099పై ఆఫర్ చేస్తున్న 50 జీబీ డేటాను 90 జీబీకి, రూ. 1299 కింద అందిస్తున్న ప్లాన్ లో 75 జీబీ డేటాను 125 జీబీకి, రూ. 1499 కింద అందిస్తున్న ప్లాన్ లో 100 జీబీ డేటాను 160 జీబీకి అందిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్లాన్స్ తీసుకున్న వారికి ఏ నెట్ వర్క్ కైనా అన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని దగ్గర చేస్తున్నామని, కొత్త కస్టమర్లు తమ ప్రయోజనాలకు అనుగుణంగా డేటా ప్లాన్స్ ఎన్నుకోవచ్చని పేర్కొంది.

  • Loading...

More Telugu News