: సోనియాగాంధీనే మోసం చేశారు.. అందుకే కేసీఆర్ ను మోదీ నమ్మడం లేదు: టీటీడీపీ నేత పెద్దిరెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ మోసకారి అంటూ టీటీడీపీ నేత పెద్దిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పి, ఆ తర్వాత సోనియాగాంధీని మోసం చేశారని విమర్శించారు. కేసీఆర్ తత్వమేంటో ప్రధాని మోదీకి బాగా తెలుసని... అందుకే ఆయనను మోదీ నమ్మడం లేదని చెప్పారు. తెలంగాణ ప్రజలను పలుసార్లు మోసగించిన కేసీఆర్ ను... జనాలు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. టీడీపీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, సైకిల్ గుర్తుపై గెలిచి టీఆర్ఎస్ లో చేరినవారు హైదరాబాద్ నగరం పరువు తీశారని ఎద్దేవా చేశారు.