: కేవలం డబ్బు కోసమే ఆమె బాలుడిపై రేప్ కేసు పెట్టిందట!
11 ఏళ్ల తన యజమాని కుమారుడు తనను రేప్ చేశాడంటూ ఓ పనిమనిషి కేసు పెట్టింది. ఆమె వయసు 21 ఏళ్లు. తనను బెడ్ మీదకు తోసేసి అత్యాచారం చేశాడంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసును విచారించిన జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యులు సదరు పనిమనిషి చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. 11 ఏళ్ల వయసున్న బాలుడు 21 ఏళ్ల యువతిని బలవంతం చేయడం సాధ్యం కాదని తెలిపింది. కేవలం డబ్బు కోసమే ఆమె తప్పుడు ఫిర్యాదు చేసిందని వెల్లడించింది. దీంతో, ఆ పనిమనిషిపై తప్పుడు ఆరోపణలు చేసిందంటూ కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది.