: బాహుబలి వచ్చినా, బాద్షా వచ్చినా.. డోంట్ కేర్: కవిత
రానున్న ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎంపీ కవిత ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభంజనాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదని అన్నారు. ఢిల్లీ నుంచి బాద్షా వచ్చినా, కాంగ్రెస్ పార్టీ నుంచి బాహుబలి వచ్చినా టీఆర్ఎస్ విజయాన్ని ఆపలేరని తెలిపారు. తమ ప్రభుత్వం పేదల, రైతుల ప్రభుత్వమని చెప్పారు. ఎన్నో సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ, ప్రజలకు ఏ లోటు లేకుండా పాలిస్తున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్న టీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో ఎంతో విశ్వాసముందని... రానున్న ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ కే ప్రజలు పట్టం కడతారని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీటిని సరఫరా చేసి... ఆడబిడ్డలకు కష్టం లేకుండా చేస్తామని అన్నారు.