: భారీ విధ్వంసానికి మావోయుస్టుల కుట్ర.. భద్రత కోసం తెలంగాణకు తరలివస్తున్న కేంద్ర బలగాలు


ఇంతకాలం ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలపైనే గురి పెట్టిన మావోయిస్టులు రూటు మార్చారు. భారీ విధ్వంసానికి వారు ప్రణాళికలు రచిస్తున్నారు. తెలంగాణలోని భారీ నీటి ప్రాజెక్టులను టార్గెట్ చేశారు. ఈ మేరకు నిఘా సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించాయి. ఈ సమాచారంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. సాగునీటి ప్రాజెక్టుల భద్రత కోసం తెలంగాణకు అదనపు బలగాలను పంపాలని నిర్ణయించింది. దీనిపై తెలంగాణ డీజీపీ స్పందించారు. ప్రాజెక్టులకు భద్రత కల్పించడానికి కేంద్ర బలగాలు వస్తున్న మాట నిజమేనని ఆయన చెప్పారు. ఈ వారంలో మూడు కంపెనీల బలగాలు వస్తున్నాయని తెలిపారు. ఈ బలగాలు రాష్ట్రంలో ఉన్న కంతనపల్లి, తుపాకులగూడెం, సీతారామ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టులతో పాటు మరికొన్న ప్రాజెక్టుల వద్ద భద్రత కల్పిస్తాయని చెప్పారు. 

  • Loading...

More Telugu News