: నిన్న కూడా మాట్లాడారంటూ దవే మృతిపై నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి


కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల మంత్రి అనిల్ మాధవ్ దవే మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దవే నిన్నటి వరకూ తమతో కలసి కీలక విధానాల సమీక్షల్లో పాల్గొన్నారని, ఆయన్ను కోల్పోవడం తనకెంతో బాధను కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన మరణం వ్యక్తిగతంగా తనకెంతో నష్టమని అన్నారు. అంకితభావం కలిగిన ప్రజా సేవకుడిగా ఆయన గుర్తుండిపోతారని కొనియాడారు.

మరో సీనియర్ మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ, దవే మరణం తనను కలచివేసిందని అన్నారు. రాజకీయంగా మరింత ఎదిగి, ప్రజలకు సుపరిపాలనను అందించడంలో సహకరిస్తారని భావించామని అన్నారు. ఆయన మృతిపట్ల కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సురేష్ ప్రభు, నితిన్ గడ్కరీ తదితరులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఓ మంచి మిత్రుడిని కోల్పోయానని వెంకయ్య వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News