: పోలీస్ స్టేషన్‌లో ప్రేమ జంటలు.. ఆశీర్వదించిన పోలీసులు!
తమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో బయట పెళ్లి చేసుకుని ఒక్కటైన నాలుగు జంటలను కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు ఆశీర్వదించారు. పోలీసులను ఆశ్రయించిన ఈ జంటలను పోరంకి, యనమలకుదురు, కానూరుకు చెందిన వారిగా గుర్తించారు. పెద్దల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరగా కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామని పోలీసులు అభయం ఇచ్చారు.
మచిలీపట్నం సమీపంలోని కంచడం, బర్రెపాడు గ్రామాలకు చెందిన కొండపల్లి సురేశ్, వట్టిప్రోలు వాణి చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో బుధవారం వీరు వివాహం చేసుకుని పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. అలాగే పోరంకికి చెందిన నరందాసు శివాజి, రమ్యలు ప్రేమికులు. వీరి పెళ్లికి కులం అడ్డుగా నిలవడంతో ఇంటి నుంచి బయటకు వచ్చి వివాహం చేసుకున్నారు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. మరో రెండు జంటలు కూడా ఇలాగే ఒక్కటయ్యాయని, వారి కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తామని పోలీసులు తెలిపారు.