: తల్లిపాత్రలో నయనతార... ముఖ్యపాత్రల్లో రాశీఖన్నా, అనురాగ్ కశ్యప్.. తెరకెక్కనున్న సస్పెన్స్ థ్రిల్లర్!
తల్లిపాత్రల్లో నటించనని గతంలో తేల్చి చెప్పిన నయనతార ఇప్పుడు తన మనసు మార్చుకుంది. విభిన్నమైన జానర్ తో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తమిళనాట దూసుకెళ్తున్న నయనతార తాజాగా తల్లిపాత్రలో నటించేందుకు అంగీకరించింది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో అధర్వ హీరోగా తెరకెక్కుతున్న ‘ఇమైక్క నొడిగల్’ సినిమాలో నయనతార నాలుగేళ్ల బిడ్డ తల్లిగా నటిస్తుండగా...రాశీ ఖన్నా ముఖ్యపాత్ర పోషించనుంది. బాలీవుడ్ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ విలన్ గా నటిస్తుండడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ సినిమా సస్పెన్స్ ధ్రిల్లర్ అని తెలుస్తోంది.