: రాష్ట్రపతి పదవి రేసులో లేను.. తేల్చి చెప్పిన శరద్ పవార్


తాను రాష్ట్రపతి పదవి రేసులో లేనని సీనియర్ నేత శరద్ పవార్ కుండ బద్దలుగొట్టారు. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ఎన్‌సీపీల తరపు నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్‌కు అభ్యర్థన వచ్చినట్టు వార్తలు రావడంతో స్పందించిన శరద్ పవార్.. తనకా ఉద్దేశం లేదని పేర్కొన్నారు. అయితే పోటీకి తగినంత బలం లేకుండా బరిలోకి దిగి పరాజయం పాలవడం ఇష్టం లేకపోవడం వల్లే వచ్చిన అవకాశాన్ని పవార్ తిరస్కరించినట్టు ఎన్‌సీపీ అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌ చెప్పారు.  

  • Loading...

More Telugu News