: ప్రభుత్వ గృహాలను ఖాళీ చేయని ఎంపీలు, మంత్రులకు జరిమానా!
ప్రభుత్వ గృహాలను సకాలంలో ఖాళీ చేయని మంత్రులు, ఎంపీలకు జరిమానా విధించాలని కేంద్రమంత్రి వర్గం నిర్ణయించింది. ఒక్క జరిమానాతోనే సరిపెట్టకుండా కేసులు నమోదు చేసి విచారణ కూడా జరిపించాలని మంత్రివర్గం బుధవారం కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ గృహాల్లో అనుమతి లేకున్నా నివసిస్తున్న మంత్రులు, ఎంపీల గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టు అయింది. ప్రభుత్వ గృహాల్లో చక్కని సదుపాయాలు ఉండడం, కరెంటు బిల్లులు చెల్లించాల్సిన పనిలేకపోవడంతో పదవీ కాలం ముగిసినా చాలామంది వాటిని ఖాళీ చేసేందుకు ఇష్టపడడం లేదు. చాలా సందర్భాల్లో బలవంతం చేయాల్సి వస్తోంది. కోర్టుకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి వర్గం తాజా నిర్ణయం తీసుకుంది.