: హిట్ కోసం స్ట్రగుల్ అవుతున్న హీరోయిన్లను లైంగికంగా వేధించడం మామూలే..: రాయ్ లక్ష్మి సంచలన వ్యాఖ్యలు


ఒక్క హిట్ కోసం ఇబ్బంది పడుతున్న హీరోయిన్లను, కోటి ఆశలతో ఇండ్రస్టీకి వచ్చిన కొత్త అమ్మాయిలను నిర్మాతలు, ఫిల్మ్‌మేకర్స్ వేధిస్తుంటారని రాయ్ లక్ష్మి ఆరోపించింది. ఎన్నో ఆశలతో వచ్చిన వారిని చాన్స్‌ల పేరుతో వేధించడం సర్వసాధారణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. సినీ రంగంలో ‘కాస్టింగ్ కౌచ్’ (అవకాశాల కోసం అమ్మాయిలు లైంగిక సుఖాలు అందించడం) మామూలు విషయంగా మారిందని పేర్కొంది.

కొందరు నిర్మాతలు సరదాలు, సుఖాలు అనుభవించేందుకే (స్లీప్ అరౌండ్) ఇండస్ట్రీకి వస్తారని తెలిపింది. తమ సుఖాల కోసం పేరున్న ఆర్టిస్టులను కూడా వీరు వదలడం లేదని తీవ్రస్థాయిలో ఇండస్ట్రీ తీరును ఎండగట్టింది. తమతో పడకగదిని పంచుకోవడానికి నిరాకరించిన ఆర్టిస్టులను కొందరు నిర్మొహమాటంగా సినిమాల నుంచి తప్పించేస్తున్నారని పేర్కొంది. కాస్టింగ్ కౌచ్ అన్ని రంగాల్లోనూ ఉందని, అయితే తన వరకు ఎప్పుడూ అటువంటి పరిస్థితి ఎదురుకాలేదని వివరించింది.

  • Loading...

More Telugu News