: సన్ రైజర్స్ కు వర్షం స్ట్రోక్... కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి!
సన్ రైజర్స్ హైదరాబాదు జట్టుకు కోల్ కతా నైట్ రైడర్స్ స్ట్రోక్ తగిలింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. పిచ్ మందకొడిగా ఉండడానికి తోడు బంతి అద్భుతంగా తిరుగుతుండడంతో సన్ రైజర్స్ విజయం నల్లేరు మీద నడకేనని అంతా భావించారు. ఈ సమయంలో దూసుకొచ్చిన వర్షం సన్ రైజర్స్ కు షాక్ ఇచ్చింది.
వర్షం ఎక్కువసేపు కురవడంతో తిరిగి మ్యాచ్ ను కొనసాగించిన అంపైర్లు 6 ఓవర్లలో 48 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతా నైట్ రైడర్స్ దూకుడుగా ఆడి 5.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో తరువాతి పోటీకి ముంబై ఇండియన్స్ తో కోల్ కతా సిద్ధం కాగా, సన్ రైజర్స్ టోర్నీ తరువాతి మ్యాచ్ లో మూడో స్థానం కోసం ఆడనుంది.