: భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.. అరెస్టయిన వారిలో లాయర్లు!


రాజస్థాన్‌లో భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది.  ఆరుగురు యువతులు సహా మొత్తం 33 మందిని స్పెషల్ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంగ్‌కు చెందిన యువతులు తొలుత సంపన్నులతో పరిచయం పెంచుకోవడం, ఆనక రూముకు పిలిచి ఏకాంతంగా గడపడం, అనంతరం రేప్ కేసు పెడతానంటూ బెదిరింపులకు దిగడం ఈ ముఠా స్టైల్. ఇప్పటి వరకు ఇలా రూ.20 కోట్లకు పైగా వసూళ్లకు పాల్పడ్డారు. ఏడాది నుంచి ఈ వ్యవహారం నడుస్తోంది. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఆరుగురు లాయర్లు కూడా ఉండడం గమనార్హం.

 ఈ రాకెట్‌లోని షికా తివారీ అనే యువతి ముంబైలోని ఓ హోటల్‌లో డీజేగా పనిచేస్తోంది. జైపూర్‌కు చెందిన ఓ ప్రముఖ వైద్యుడిని ట్రాప్ చేసి బ్లాక్‌మెయిల్ చేసింది. ఆయన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసులు షికా తివారీని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ముఠాలో ముఖ్యపాత్ర పోషిస్తున్న అకన్‌షా హిజ్‌కిల్‌, ఆమె స్నేహితుడు అక‌్షంత్‌ శర్మను అజ్మీర్‌లో మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. సంపన్నులే ఈ ముఠా లక్ష్యమని, ట్రాప్ లోకి దించి ఏకాంతంగా గడపడం, తర్వాత రేప్ కేసు పెడతానని బెదిరించి డబ్బులు దోచుకోవడం ఈ ముఠా వ్యవహార శైలి అని పోలీసుల విచారణలో తేలింది. తమ డిమాండ్లకు ఒప్పుకోని కొందరిపై రేప్ కేసు కూడా పెట్టినట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News