: హైదరాబాద్ పోలీసుల అదుపులో ముగ్గురు ఐసిస్ అనుమానితులు!
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ కు చెందిన ముగ్గురు అనుమానితులను హైదరాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబ్దుల్ బాసిత్, మొహినుద్దీన్, ఖురేషి లను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విషయాన్ని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. పలు విషయాలపై ఆరా తీస్తున్నామని చెప్పారు.