: కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి కాకపోవడంపై చంద్రబాబు అసహనం
విజయవాడలో కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం ఇప్పటికీ పూర్తి చేయకపోవడంపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అక్టోబర్ 2 నాటికి ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. రహదారులు, భవనాల శాఖపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వర్షాకాలం వచ్చే నాటికి రహదారుల మరమ్మతులు పూర్తి చేయాలని, గుర్తించిన 1,013 ప్రాంతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని అధికారులను ఆదేశించారు.