: అక్కడ.. నేను, ఈటల ఇళ్లు కొనుగోలు చేస్తాం: సీఎం కేసీఆర్


కరీంనగర్ లో మానేరు నదికి అభిముఖంగా నివాస గృహాలు నిర్మిస్తామని, అక్కడ, తాను, ఈటల రాజేందర్ ఇళ్లను కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. కరీంనగర్ అభివృద్ధిపై ఈ రోజు నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తామని, పచ్చదనాన్ని పెంచేందుకు నాలుగైదు లక్షల మొక్కలు నాటాలని సూచించారు.

ఈ ఏడాది ‘హరితహారం’ కార్యక్రమాన్ని కరీంనగర్ లో ప్రారంభించనున్నట్టు చెప్పారు. కమిషనరేట్ కు కొత్త భవనం నిర్మిస్తామని, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, అవసరమైన చోట్ల రోడ్లు వెడల్పు చేయాలని ఆదేశించారు. కరీంనగర్ ను ఆనుకుని హైవేల నిర్మాణం జరుగుతోందని, మరో 3.5 కిలోమీటర్ల లింక్ జత చేస్తే అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పూర్తవుతుందన్నారు. పది ఎకరాల్లో కళాభారతి, రూ.25 కోట్లతో ఐదు మార్కెట్లు ఏర్పాటు చేస్తామని, నిరంతర విద్యుత్ కోసం నాలుగు 33/11 కేవీ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News