: చల్ల చల్లని వార్త... ఆ బస్‌స్టాప్‌లో ఏసీ సౌకర్యం!


కొన్ని బ‌స్టాండ్ల‌లో నిల్చున్నా పైన టాప్ లేకపోవడంతో ఎండ తగులూతూనే ఉంటుంది. వడగాల్పులతో ఉడికిపోతుంటాం. అయితే, దేశరాజధాని ఢిల్లీలోని లజపత్‌నగర్ బస్‌స్టాప్‌కు వెళ్తే మాత్రం ఇక‌పై ఎండ‌కాలంలో కూడా చ‌ల్ల‌ద‌నాన్ని పొంద‌వ‌చ్చు. ఆ బ‌స్టాండులో ఏసీ ఏర్పాటు చేశారు. దేశంలోనే ఇది మొద‌టి ఎయిర్‌కండీషన్‌ (ఏసీ) బస్టాండ్ కావ‌చ్చు. ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ డైకిన్‌తో ఆ రాష్ట్ర స‌ర్కారు ఒప్పందం చేసుకొని ఈ ఏసీ సౌకర్యాన్ని కల్పించడంతో ఆ బ‌స్టాండుకు వ‌స్తోన్న ప్ర‌యాణికులు మండే ఎండ‌ల్లో చ‌ల్ల‌ద‌నాన్ని పొందుతున్నారు.


  • Loading...

More Telugu News