: సీనియర్ జర్నలిస్టు అర్ణబ్ గోస్వామిపై పోలీసులకు ‘టైమ్స్ నౌ’ ఫిర్యాదు!


సీనియర్ జర్నలిస్టు, ‘టైమ్స్ నౌ’లో సంపాదకుడిగా పని చేసి బయటకు వచ్చిన అర్ణబ్ గోస్వామి .. రిపబ్లికన్ టీవీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తమ ఛానెల్ కు సంబంధించిన సమాచార కాపీలు ‘రిపబ్లికన్’లో ప్రసారమయ్యాయంటూ అర్ణబ్ పై ‘టైమ్స్ నౌ’ ముంబైలోని ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ సమాచార కాపీలను ఈ నెల 6, 8 తేదీల్లో అక్రమంగా వాడుకున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ గా పిలవబడే బెన్నెట్, కోల్మన్ అండ్ కో లిమిటెడ్ గ్రూప్ ఆరోపించింది.

అర్ణబ్ దొంగతనం, క్రిమినల్, ఉల్లంఘన, ఆస్తి దుర్వినియోగం తదితర నేరాలకు పాల్పడినట్టు ఆ ఫిర్యాదులో ఆరోపించింది. ‘రిపబ్లికన్ టీవీ’ ప్రారంభించిన రోజున, ఆ తర్వాత తమ ఛానెల్ కు సంబంధించిన కొన్ని ఫుటేజ్ లను ఆయన వాడుకున్నారని ఆరోపించింది. మే 6న బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, ఆ పార్టీ నేత షాబుద్దీన్ మధ్య ఫోన్ సంభాషణల ఆడియో టేపులను, మే 8న సునందా పుష్కర్ తో అప్పటి తమ రిపోర్టర్ ప్రేమా శ్రీదేవి ఫోన్ సంభాషణల టేపులను వాడుకున్నారని ఆరోపించింది. ఈ రెండు ఆడియో టేపులు ప్రేమా శ్రీదేవి, అర్ణబ్ లు తమ సంస్థలో పని చేస్తున్నప్పటివని, ‘టైమ్స్ నౌ’ మేధో సంపదను వాళ్లిద్దరూ వాడుకోవడంపై పలు సెక్షన్ల కింద విచారణ చేపట్టాలని ఆ ఫిర్యాదులో కోరింది.

  • Loading...

More Telugu News