: అందరూ అలా చేస్తే, ఆర్కే లక్ష్మణ్ ఎప్పుడూ జైల్లోనే ఉండేవారు: మాజీ ఎడిటర్ వెంకట్ నారాయణ
సోషల్ యాక్టివిస్ట్ లను అరెస్ట్ చేయడం సరికాదని, అందరూ అలా చేస్తే, ఆర్కే లక్ష్మణ్ ఎప్పుడూ తీహార్ జైల్లోనే ఉండేవారని ఇండియా టుడే మాజీ సంపాదకుడు వెంకట్ నారాయణ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, విమర్శ చేయడమనేది ప్రజాస్వామ్యంలో భాగమని, వ్యంగ్య విమర్శ, కార్టూన్ ప్రతి పౌరుడి హక్కు అని అన్నారు. ప్రస్తుతం ఏపీలో వ్యవహరించినట్టే నాడు తమిళనాడులో జయలలిత వ్యవహరించినందుకు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిందన్నారు. ప్రతిపక్షం లేకుంటే నియంతృత్వం వస్తుందని, ఐదేళ్ల తర్వాత ప్రజల వద్దకు వెళ్లాలనే విషయాన్ని ఏపీ సర్కార్ మరచిపోకూడదన్నారు.