: చైతూ సినిమా ట్రైలర్ గురించి కాబోయే కోడలితో ఛాటింగ్ చేసిన అక్కినేని నాగార్జున


అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైత‌న్య హీరోగా కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమా ట్రైల‌ర్ ఇటీవ‌లే విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ ట్రైల‌ర్ నాగ‌చైతన్య ప్రియురాలు, న‌టి స‌మంత‌కు బాగా న‌చ్చేసింద‌ట‌. ఈ విష‌యాన్ని త‌న మామ‌య్య అక్కినేని నాగార్జునకు ఛాటింగ్ లో తెలిపింది. త‌న కోడ‌లు త‌న‌తో చేసిన ఆ ఛాటింగ్‌ను నాగార్జున త‌మ అభిమానుల‌తో పంచుకున్నారు. ‘ట్రైలర్‌ చాలా నచ్చింది, ఆయ‌న చాలా బాగున్నారు.. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను.. థ్యాంక్యు’ అని అందులో స‌మంత పేర్కొంది. ఆమె చేసిన ఛాటింగ్ ను నాగ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ట్రైల‌ర్‌లోని ‘అమ్మాయి మనశ్శాంతికి హానికరం’ అనే డైలాగ్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ ట్రైల‌ర్‌కి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింద‌ని నాగార్జున అన్నారు. ఈ సినిమా మ‌రో 10 రోజుల్లో విడుద‌ల కానుంది.

  • Loading...

More Telugu News