: చురుగ్గా సాగుతున్న ‘మహానాడు’ ఏర్పాట్లు: మంత్రి అయ్యన్నపాత్రుడు


విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్ లో మహానాడు నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నట్టు మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. విశాఖ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటి వరకు డెబ్భై శాతం పనులు పూర్తయ్యాయని, ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. ఈ నెల 24న ప్రారంభమయ్యే ‘మహానాడు’లో సుమారు 36 అంశాలపై చర్చ జరగనుందన్నారు. ఈ సందర్భంగా ‘మహానాడు’కు హాజరయ్యే అతిథులకు రుచి చూపించబోయే వంటకాల గురించి ఆయన ప్రస్తావించారు. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లా వంటకాలే ఉంటాయని, మాడుగుల హల్వ, పూత రేకులు, తాపేశ్వరం కాజా ఉంటాయన్నారు. కాగా, భోజన కమిటీ చైర్మన్ గా మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యవహరిస్తున్నారు. 

  • Loading...

More Telugu News