: ట్రంప్ మాకు ఆ రహస్యం చెప్పలేదు.. కావాలంటే లిఖితపూర్వక హామీ ఇస్తా: రష్యా అధ్యక్షుడు పుతిన్


రష్యా రాయబారితో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రహస్య సమాచారం పంచుకున్నారంటూ వస్తోన్న వార్తలు అమెరికాలో సంచ‌ల‌నం క‌లిగిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యం ట్రంప్ కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా ఉంది. కాగా, ఇదే విషయంపై ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ట్రంప్ తమకు ఎలాంటి రహస్య సమాచారం చెప్పలేదని అన్నారు. ఈ అంశంపై వ‌స్తోన్న వార్త‌లన్నీ అబ‌ద్ధాలేన‌ని ఆయ‌న అన్నారు. కావాలంటే ఈ అంశంపై లిఖితపూర్వక హామీ కూడా ఇస్తాన‌ని వ్యాఖ్యానించారు.

ఇటీవల ఐఎస్ఐఎస్ స్థావరాలపై అమెరికా దాడులు నిర్వ‌హించింది. ఈ నేప‌థ్యంలో వారం క్రితం అమెరికా పర్యటనకు వెళ్లిన రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగానే ఉగ్రవాదులను అంత‌మొందించ‌డానికి తాము చేపట్టిన ఆపరేషన్‌కు సంబంధించి కీల‌క సమాచారాన్ని డొనాల్డ్ ట్రంప్‌ రష్యా విదేశాంగమంత్రికి చెప్పినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

  • Loading...

More Telugu News