: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వద్ద క్రికెట్ అభిమానుల ఆందోళన


ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ సీజ‌న్ తుది ఘ‌ట్టానికి చేరుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం సెమీ ఫైన‌ల్స్ జ‌రుగుతున్నాయి. అనంత‌రం ఈ నెల 21న హైద‌రాబాద్ శివారులోని ఉప్ప‌ల్ స్టేడియంలో ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ ను ప్ర‌త్య‌క్షంగా చూడాల‌ని క్రికెట్ అభిమానులు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. అయితే, స్టేడియం వ‌ద్ద ఇప్ప‌టికీ టికెట్ల విక్ర‌యాలు ప్రారంభం కాలేదు. మ‌రోవైపు ఈ నెల 15 నుంచే టిక్కెట్ల‌ను విక్ర‌యిస్తామ‌ని హెచ్‌సీఏ ప్ర‌క‌టించింది. హెచ్‌సీఏ ఆఫీసు దగ్గరకి వెళ్లిచూస్తే 'సోల్డ్‌ అవుట్' అంటూ ఓ బోర్డు క‌న‌ప‌డింది. ఈ విష‌యం గురించి మాట్లాడ‌డానికి కార్యాలయ అధికారులు అందుబాటులో లేరు. దీంతో హెచ్‌సీఏ కార్యాలయం ఎదుట క్రికెట్‌ అభిమానులు ఆందోళనకు దిగి, త‌మ‌కు టిక్కెట్లు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News