: ఎక్కువగా సెలవులు పెట్టే సీఎం ఆయనే!: కేజ్రీవాల్ పై కపిల్ మిశ్రా ఆరోపణలు
ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ బహిష్కృత నేత కపిల్ మిశ్రా మరోమారు సీఎం కేజ్రీవాల్ పై విమర్శలు గుప్పించారు. కార్యాలయానికి వెళ్లకుండా, మంత్రులతో ఎలాంటి సమావేశాలకు హాజరుకాని ఏకైక ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అని, దేశంలోని ముఖ్యమంత్రులందరిలోకి ఆయన హాజరు మాత్రమే చాలా తక్కువగా ఉందని విమర్శించారు. ఎక్కువగా సెలవులు పెట్టే, అవినీతి కేసులు ఉన్న ముఖ్యమంత్రి కూడా ఆయనేనని ఆరోపించారు. కేజ్రీవాల్ స్నేహితులు, బంధువుల ఇళ్లలో దాడులు జరుగుతున్నా, అవినీతి వెలుగు చూస్తున్నా ఆయన మాత్రం తాపీగా ‘సర్కార్-3’ సినిమా చూడడానికి వచ్చారంటూ కపిల్ మిశ్రా తన ట్వీట్ లో విమర్శించారు.