: పేటీఎం ఎఫెక్ట్.. లాభాలతో ముగిసిన నేటి స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో ఈ రోజు స్టాక్ మార్కెట్ల సూచీలు ఆరంభంలోనే మదుపర్లు లాభాల స్వీకరణకు మెుగ్గు చూపడంతో రికార్డు స్థాయి నుంచి పడిపోయాయి. దీంతో నష్టాల బాట పట్టాయి. అయితే, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కు ఆర్బీఐ నుంచి తుది అనుమతులు లభించడంతో దేశీయ మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి. దీంతో, నష్టాల నుంచి లాభాల బాట పట్టి, చివరకు కొత్త రికార్డుల్లో ముగిశాయి.
ఈ రోజు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 76 పాయింట్లు లాభపడి 30,659 వద్ద, నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 9,526 పాయింట్ల వద్ద రికార్డు స్థాయిలో ముగిశాయి. కాగా, ఎన్ఎస్ఈలో టాటా స్టీల్, భారతి, ఇన్ఫ్రాటెల్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభపడగా, టెక్ మహీంద్రా, ఏసీపీ లిమిటెడ్, బోష్ లిమిటెడ్, ఎస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ షేర్లు స్వల్ప నష్టాలు చవిచూశాయి.