: మరింత పెరిగిన బంగారం ధర!
అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో ఈ రోజు మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 160 రూపాయలు పెరిగి రూ.28,760గా నమోదైంది. మరోవైపు నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరిగిపోవడంతో వెండి ధర కూడా రూ.400 పెరిగింది. ఈ రోజు కిలో వెండి ధర రూ.39,300గా నమోదైంది. గ్లోబల్ మార్కెట్లో పసిడి ధర 0.51 పెరిగి ఔన్సు 1,243 అమెరికన్ డాలర్లుగా నమోదైంది.