: వాళ్లిద్దరిలో ప్రభాసే అందగాడంటున్న అనుష్క!
‘బాహుబలి-2’ కలెక్షన్ల పరంగా ఎంత రికార్డు సృష్టించిందో, ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన నటీనటులు కూడా తమ నటన ద్వారా అంతే రికార్డు సృష్టించారు. ముఖ్యంగా ప్రభాస్, రానా, అనుష్కల నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ‘బాహుబలి-2’లో ప్రభాస్, అనుష్కల మధ్య ప్రేమ సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా, ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో అనుష్కను ఓ ఆసక్తికర ప్రశ్న అడిగితే, ఏమాత్రం తడుముకోకుండా ఆమె ఠక్కున సమాధానమిచ్చింది.
ఇంతకీ, ఆ ప్రశ్న ఏంటంటే.. ‘ప్రభాస్, రానాల్లో ఎవరు అందగాడు?’. ఈ ప్రశ్నకు ‘ప్రభాస్’ అని అనుష్క సమాధానమిచ్చింది. రానా తనకు సోదరుడు లాంటి వాడని, రానా తనను ‘బ్రదర్’ అని అంటారని, తాను కూడా ‘బ్రదర్’ అనే రానాను పిలుస్తానని ‘బాహుబలి’ దేవసేన చెప్పింది.