: వైట్ హౌస్ లోకి దూకబోయిన మహిళపై కేసు నమోదు!


అమెరికా అధ్యక్ష భవనం 'వైట్ హౌస్'లోకి దూకబోయిన ఓ మహిళను యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వైట్ హౌస్ పెన్సిల్వేనియా అవెన్యూ వెంబడి నార్త్ ఫెన్స్ లైన్ పై నుంచి నిన్న ఓ మహిళ లోపలికి దూకబోయింది. వెంటనే, అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు ఆమెపై కేసు నమోదు చేశామని పేర్కొన్న అధికారులు, సదరు మహిళ వివరాలను మాత్రం వెల్లడించలేదు. వైట్ హౌస్ లోకి మహిళ దూకబోయిన సమయంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌథంలోనే ఉన్నారు. కాగా, ఇటువంటి సంఘటనలు జరగడం ఇదేమి తొలిసారి కాదు. ఈ ఏడాది మార్చిలో ఓ వ్యక్తి బారికేడ్లు దాటుకుని వైట్ హౌస్ పరిసరాల్లోకి వెళ్లాడు.

  • Loading...

More Telugu News