: అవార్డును అందుకొని పరుగెత్తుకుంటూ వెళ్లి తన అభిమానికి ఇచ్చేసిన కోహ్లీ.. మీరూ చూడండి!
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం కోహ్లీ తనకు వచ్చిన అవార్డుని స్టేడియంలోని తన అభిమానికి ఇచ్చేశాడు. ఈ దృశ్యాన్ని ఓ అభిమాని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ మధ్య జరిగిన చివరి మ్యాచ్ లో బెంగళూరు గెలిచింది. అద్భుతంగా రాణించిన కెప్టెన్ కోహ్లీకి స్టైలిష్ ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు లభించగా, ఆ అవార్డుని ఆ వెంటనే ఇలా తన అభిమానికి ఇచ్చేశాడు. అంతకు ముందు ఆ అభిమాని కోహ్లీతో తనకు ఆ అవార్డు కావాలని అడిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను మీరూ చూడండి..