: ‘ఫోర్బ్స్ గ్లోబల్ గేమ్ ఛేంజర్స్’ జాబితాలో తొలిస్థానంలో ముఖేష్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీకి ‘ఫోర్బ్స్ గ్లోబల్ గేమ్ ఛేంజర్స్’ జాబితాలో తొలి స్థానం దక్కింది. గత ఏడాది ఆయనకు చెందిన రిలయన్స్ జియో సంచలనం సృష్టించి ఎవ్వరూ ఊహించని విధంగా అత్యధికంగా వినియోగదారులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన 25 మంది పారిశ్రామికవేత్తల జాబితాలో ఆయనకే అగ్రస్థానం దక్కింది. ఈ జాబితాలో ముఖేష్ అంబానీ తరువాత గృహోపకరణ సంస్థ డైసన్‌ను స్థాపించిన జేమ్స్ డైసన్, అమెరికా గ్లోబల్ పెట్టుబడి నిర్వహణ కార్పొరేషన్ బ్లాక్ క్రాక్ సహ వ్యవస్థాపకుడు లారీఫింక్ ఉన్నారు.