: మరోసారి దుస్సాహసం చేసిన చైనా!
దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దుందుడుకు చర్యలతో ముందుకు వెళుతోంది. వియత్నమీస్ మిలిటరీ కంబాట్ డైవర్స్‌కు చెక్ చెప్పడానికి ఆ వివాదాస్పద దీవుల్లోకి చైనా రాకెట్ లాంచర్లను పంపడంతో కలకలం రేగుతోంది. ఈ ప్రాంతం తమదేనని చైనా వాదిస్తోన్న విషయం తెలిసిందే. ఈ అంశంపై అమెరికా గతంలో చైనాను హెచ్చరించింది. ఆ సముద్రంపై చైనాకు ఎలాంటి హక్కు లేదని అంతర్జాతీయ కోర్టు చెప్పినప్పటికీ, ఇలా రాకెట్ లాంచర్లను మోహరింపజేసి అమెరికాను మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. స్పార్ట్‌లీ దీవుల్లోని ఫియెరీ క్రాస్ రీఫ్‌పై శత్రు దేశాల కంబాట్ డైవర్స్‌ను పసిగట్టి, గుర్తించి, దాడి చేయగల సీఎస్/ఏఆర్-1 టైపు రాకెట్ లాంచర్లను చైనా మోహరించిందని అక్కడి అధికార పత్రిక డిఫెన్స్ టైమ్స్ పేర్కొంది.