: జగన్ పర్యటన తర్వాతే టీడీపీ కార్యకర్త హత్య జరిగింది: ఎంపీ రాయపాటి
గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలోని కండ్లకుంటలో టీడీపీ కార్యకర్త పాపిరెడ్డి హత్యను ఆ పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఖండించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పర్యటించి వెళ్లిన తర్వాతే పాపిరెడ్డి హత్యకు గురయ్యారని ఆయన ఆరోపించారు. వైఎస్సార్సీపీ దౌర్జన్యాలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, అలాగే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం సరికాదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని రాయపాటి కోరారు.