: క్రీడాకారిణుల పోరాటం ఫలించింది... షరపోవాకు షాక్!


రష్యా టెన్నిస్ అందం మరియా షరపోవాకు మరోసారి షాక్ తగిలింది. ఇటీవలే టెన్నిస్ లో 15 నెలల నిషేధం పూర్తి చేసుకున్న షరపోవాకు ఫ్రెంచ్‌ ఓపెన్ లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ లభిస్తుందని అంచనా వేశారు. దీనిపై టెన్నిస్ క్రీడాకారిణులంతా మండిపడ్డారు. షరపోవాపై జీవితకాల నిషేధం పడాలని వారు డిమాండ్ చేశారు. ఫ్రెంచ్ ఓపెన్ లో షరపోవా ఆడితే టెన్నిస్ పతనానికి నాంది అని అర్థం చేసుకుంటామని పలువురు టెన్నిస్ క్రీడాకారిణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేశారు. షరపోవా టోర్నీలో ఆడేందుకు అనుమతి లేదని అన్నారు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ అర్హత టోర్నీ ఆడేందుకు సరిపడా ర్యాంకింగ్‌ పాయింట్లు ఆమె ఖాతాలో లేవని.... అందుకే వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేదని తేల్చిచెప్పారు. దీంతో ఈనెల 28 నుంచి ప్రారంభం కానున్న ఫ్రెంచ్ ఓపెన్ కు మరియా షరపోవా దూరమైనట్టే. 

  • Loading...

More Telugu News