: ఉగ్రవాదులు చొరబడ్డారని సమాచారం... వెయ్యి మంది భద్రతా బలగాలతో షోపియాన్‌లో సోదాలు
ఇటీవలే జమ్ము కశ్మీర్ లో భారీగా భద్రతా బలగాలు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రోజు కూడా అదే రాష్ట్రంలోని షోపియాన్ ప్రాంతంలోని ఓ గ్రామంలో సుమారు 1000 మంది భద్రతా బలగాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఆ గ్రామంలో ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారంతో వారిని హతమార్చేందుకు సుమారు 500 నివాసాలను జల్లెడ పడుతున్నామని అధికారులు తెలిపారు. ఈ రోజు తెల్లవారు జామున కూడా హెఫ్ షిర్మాల్ అనే గ్రామంలో తొలి సెర్చింగ్ ఆపరేషన్ పూర్తయిందని చెప్పారు. ఈ ఆపరేషన్‌లో ఆర్మీ, కేంద్ర బలగాలు, పోలీసులు పాల్గొంటున్నారు.