: రణ్ బీర్ కపూర్ తో ఆమె ఎవరు?
బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ కు చెందిన ఫోటోలు బాలీవుడ్ లో ఆసక్తిని రేపుతున్నాయి. కత్రినా కైఫ్ తో బంధం బెడిసికొట్టిన అనంతరం లండన్ లో సంబంధాలు వెతుకుతున్నారని, తల్లితో కలసి ఓ అమ్మాయిని చూసేందుకు లండన్ వెళ్లాడంటూ బాలీవుడ్ మీడియా కధనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో రణ్ బీర్ తో కలసి వున్న ఓ అపరిచితురాలి ఫొటోలు దర్శనమిచ్చాయి.
దీంతో రణ్ బీర్ తో వున్న కొత్త యువతి ఎవరు? అంటూ కథనాలు వెలువడగా, ఆమె లండన్ కు చెందిన మోడల్ అని తెలుస్తోంది. సంజయ్ దత్ బయోపిక్ కోసం 13 కేజీల బరువు పెరిగిన రణ్ బీర్ ఫిట్ గా కనిపించగా, వారిద్దరి చిత్రాలు మాత్రం బోల్డ్ గా యువకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే అవి 'మాక్రో' ఇన్నర్ వేర్ కు సంబంధించిన యాడ్ ఫోటోలని తెలుస్తోంది. ఆమెతో ఫోటో షూట్ కోసమే రణ్ బీర్ లండన్ వెళ్లాడని అంటున్నారు. కాగా, రణ్ బీర్ తన ప్రియురాలు కత్రినా కైఫ్ తో కలిసి నటించిన 'జగ్గా జాసూస్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా, సంజయ్ దత్ బయోపిక్ ఆధారంగా రూపొందుతున్న సినిమాలో ప్రస్తుతం నటిస్తున్నాడు.