: గతేడాది ఫలితం రిపీటవుతుందా?


ఐపీఎల్ లో గతేడాది ఫలితం రిపీటవుతుందా? అంటే పరిస్థితులన్నీ అలాగే కనిపిస్తున్నాయి. గత ఏడాది ఐపీఎల్ సిజన్-9లో ఎలిమినేటర్ మ్యాచ్ లో నాలుగవ స్థానంలో నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ తలపడింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు ఫైనల్ మ్యాచ్ లో దుమ్మురేపి టైటిల్ సాధించింది. ఈసారి కూడా ఈ రెండు జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ లో తలపడుతున్నాయి. ఈ రెండు జట్ల ఆటగాళ్లలో పెద్దగా మార్పులు కూడా లేవు. గత ఏడాది మ్యాచ్ లను ముస్తాఫిజుర్ రెహ్మాన్ మలుపు తిప్పగా, ఈ సారి అతని స్థానంలో లోకల్ ఆటగాడు సిరాజ్ ఆకట్టుకుంటున్నాడు. కోల్ కతా జట్టులో కూడా పెద్దగా మార్పులు లేవు. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాదు గెలిస్తే, తరువాతి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. అది కూడా గెలిస్తే...ఫైనల్ లో పూణేతో ఆడనుంది. 

  • Loading...

More Telugu News