: మనిషిని కరిచిందని... కుక్కకు మరణదండన విధించిన పాకిస్థాన్!


ఓ బాలుడిని తీవ్రంగా గాయపరిచిందన్న ఆరోపణలపై ఓ కుక్కకు మరణదండన విధించిన విచిత్ర సంఘటన పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో జరిగింది. ఈ మేరకు అసిస్టెంట్ కమిషనర్ రాజా సలీం ఆదేశాలను జారీ చేస్తూ, బాధిత బాలుడు తీవ్రంగా గాయపడినందున దోషి అయిన శునకానికి ఈ శిక్ష వేస్తున్నట్టు తెలిపారు. దీనిపై శునకం యజమాని జమీల్ ఆవేదన వ్యక్తం చేస్తూ, తన పెంపుడు జంతువును ఇప్పటికే వారం రోజులుగా జైల్లో ఉంచారని, ఇప్పుడు దాన్ని తమకు శాశ్వతంగా దూరం చేయడం తగదని అపీలు చేశారు. ఈ ఆదేశాలపై కోర్టుకెళ్లి న్యాయ పోరాటం చేస్తానని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News