: ట్రంప్ పై ప్రొఫెసర్ అలన్ లిట్చ్ మన్ చెప్పిన విశ్లేషణ నిజమవుతుందా?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ నిలబడుతున్నానని ప్రకటన చేసిన అనంతరం సర్వేలన్నీ ట్రంప్ కు వ్యతిరేకంగా రాగా.... ప్రముఖ పొలిటికల్ అనలిస్టు, ప్రొఫెసర్ అలన్ లిట్జ్ మన్ మాత్రం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంపే విజయం సాధిస్తారని తేల్చిచెప్పారు. అయితే ఆయన ఎన్నికల ప్రచారంలో చేసినట్టే వివాదాస్పద చర్యలు చేపడితే మాత్రం... ఆయనను అభిశంసన తీర్మానం ద్వారా పదవి నుంచి తొలగిస్తారని కూడా పేర్కొన్నారు. అంతేకాకుండా, ట్రంప్ అధ్యక్షుడిగా పదవి చేపట్టిన కొన్ని రోజులకే ట్రంప్ పై మహాభియోగ తీర్మానం ప్రవేశపెడతారని, దీంతో ట్రంప్ రాజద్రోహం కింద పదవి నుంచి వైదొలుగుతారని తెలిపారు. ట్రంప్ పై రోజుకో ఆరోపణ, వివాదం వెలుగు చూస్తున్న నేపథ్యంలో ప్రొఫెసర్ అలన్ లిట్చ్‌మన్ జోస్యం నిజమయ్యేలా కనిబడుతోందని అమెరికా వాసులు గుర్తుచేసుకుంటున్నారు.