: తమిళనాట కలకలం... మంత్రి విజయభాస్కర్ ఇళ్లపై ఐటీ దాడులు


తమిళనాడులో ఆర్కే నగర్ నియోజకవర్గంలో ఓటర్లకు డబ్బులు పంచాడన్న ఆరోపణలను ఎదుర్కొన్న మంత్రి విజయభాస్కర్ పై ఆదాయపు పన్ను అధికారులు మరోసారి కొరడా ఝళిపించారు. ఇలుప్పుర, పుకొట్టాయ్ ప్రాంతాల్లోని ఆయన నివాసాల్లో ఈ ఉదయం దాడులు చేశారు. ఆర్కే నగర్ లో దినకరన్ కు ఓట్లు వేయాలని కోరుతూ, విజయభాస్కర్ డబ్బులు పంచారన్నదానికి సాక్ష్యాలను సేకరించిన అధికారులు గతంలోనూ ఓ సారి ఆయన ఇంట్లో దాడులు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆయనతో పాటు ఆయన అనుచరులైన మాజీ ఎంపీ రాజేంద్రన్, వైస్‌ చాన్స్‌లర్‌ గీతాలక్ష్మి ఇళ్లపైనా దాడులు చేస్తున్నారు. తాజా ఐటీ దాడులతో తమిళనాడు రాజకీయ నేతల్లో కలవరం మొదలైంది.

  • Loading...

More Telugu News