: ఏపీలో బయటపడ్డ మరో కుంభకోణం... ప్రైవేటు ఆసుపత్రి వైద్యుల హవాలా దందా...సెటిల్ మెంట్ కు పోలీసుల రంగప్రవేశం


విశాఖపట్టణాన్ని ఒక్క కుదుపు కుదిపేసిన 1500 కోట్ల హవాల కుంభకోణం బయటపడ్డ రెండో రోజే... ఏపీ ఆర్థిక రాజధాని విజయవాడలో ప్రముఖ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్ల హవాలా కుంభకోణం బట్టబయలైంది. విజయవాడలోని ప్రజల కష్టాన్ని దోచుకుని ప్రముఖ ఆసుపత్రులుగా ఎదిగిన హెల్ప్, టైమ్  ఆసుపత్రుల ఎండీల హవాలా లీలలు ఏజెంట్ ను కిడ్నాప్ చేసి, చిత్రహింసల పాలు చేయడంతో బట్టబయలయ్యాయి. ఈ కేసు బయటకు రాకుండా పోలీసు పెద్దలు రంగప్రవేశం చేసి సెటిల్ మెంట్ కు యత్నించడం కలకలం రేపుతోంది.

ఘటన వివరాల్లోకి వెళ్తే...  హెల్ప్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ చలపాటి రవి, టైమ్ ఆసుపత్రి ఎండీ మైనేని హేమంత్ లు విదేశాలకు బ్లాక్ మనీని వివిధ మార్గాల్లో పంపి, ఆ డబ్బును తిరిగి హవాలా మార్గంలో విజయవాడ రప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో విదేశాల నుంచి వచ్చిన డబ్బును ఏజెంట్ బ్రహ్మాజీ సకాలంలో అందజేయలేదు. దీంతో అతనిని కిడ్నాప్ చేసిన వైద్యులు చిత్రహింసలకు గురిచేశారు. అనంతరం రంగంలోకి పోలీసులను దించారు. దీంతో వారు కేసును సెటిల్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ తతంగం మొత్తం బట్టబయలు కావడంతో కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్న సీపీ గౌతమ్ సవాంగ్ వారిని విధుల నుంచి తప్పించి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. 

  • Loading...

More Telugu News