: తీరని బీజేపీ ఆశ... పశ్చిమ బెంగాల్ స్థానిక ఎన్నికల్లో ఎదురులేని తృణమూల్ కాంగ్రెస్
పశ్చిమ బెంగాల్ లో ఈ నెల 14న జరిగిన 7 మునిసిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ప్రారంభం కాగా, అధికార తృణమూల్ కాంగ్రెస్ దూసుకెళుతోంది. ఈ ఎన్నికల్లో బలమైన పోటీ ఇస్తుందని భావించిన బీజేపీ అత్యధిక చోట్ల వెనుకంజలో ఉంది. 7 మునిసిపాలిటీల్లో ఇప్పటికే నాలుగు మునిసిపాలిటీల ఫలితాలు వెల్లడికాగా, నాలుగింటినీ టీఎంసీ గెలుచుకుంది. 9 వార్డులున్న మిరిక్ లో 6 వార్డులను, 21 వార్డులున్న దోమకల్ లో 18 వార్డులను, 16 వార్డులున్న పుజాలిలో 12 వార్డులను, 27 వార్డులున్న రాయ్ గంజ్ లో 24 వార్డులను టీఎంసీ గెలుచుకుంది. ఇక కుర్సెనాంగ్, డార్జీలింగ్, కలింపాంగ్ మునిసిపల్ ఫలితాల కోసం ఓట్ల లెక్కింపు సాగుతుండగా, చాలా చోట్ల టీఎంసీ అభ్యర్థులు ముందున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికలతో బెంగాల్ లో కాలు మోపాలన్న బీజేపీ ఆశలు ప్రస్తుతానికి తీరనట్టేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.