: పాక్ తో ఉద్రిక్తతల నడుమ.. థార్ ఎడారుల్లో సత్తాను చాటిన భారత సైన్యం


భారత్, పాక్ నడుమ సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న వేళ, రాజస్థాన్ లోని ఎడారుల్లో, సరిహద్దులకు సమీపంలో భారత సైన్యం తన సత్తాను చాటింది. ట్యాంకులు, ఆర్టిలరీ గన్స్, అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ విమానాలను పరీక్షిస్తూ, 20 వేల మంది సైనికులు 'థార్ శక్తి' విన్యాసాలను పూర్తి చేశారు. గత నెల 10న ప్రారంభమైన ఈ విన్యాసాలు ముగిశాయి. యుద్ధరంగంలో పాటించాల్సిన వ్యూహాలు, శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా పోరాడే విధానాలు, మారిపోయే వాతావరణ పరిస్థితుల మధ్య నిలబడి పోరాడే మార్గాలు తదితరాలపై సైనికులు తమ సత్తాకు తామే పరీక్ష పెట్టుకున్నారు.

చేతక్ కార్ప్స్ లోని 20 వేల మంది సైనికులు తేలికపాటి యుద్ధ వాహనాలు, ఆధునిక నిఘా వ్యవస్థలు, అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో పనిచేసే సెన్సార్లు, సమాచార పరికరాలను విన్యాసాల్లో భాగంగా వినియోగించగా, భారత వాయుసేనకు చెందిన విమానాలు, చాపర్లు తమ వంతు సాయాన్ని అందించాయని లెఫ్టినెంట్ జనరల్ అశ్వని కుమార్ తెలిపారు. యుద్ధ విన్యాసాలు సంతృప్తికరంగా ముగిశాయని, అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతంలోనూ భారత సైన్యం సమర్థవంతంగా పోరాడగలదని తేలిందని అన్నారు.

  • Loading...

More Telugu News