: అధ్యక్షుడిపై అసత్య ప్రచారం ఆపండి!: వైట్ హౌస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అసత్య ప్రచారం తగదని మీడియా సంస్థలకు వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది. మీడియాలో వస్తున్న విధంగా అధ్యక్షుడు ట్రంప్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జనరల్ ఫ్లైన్ పై విచారణను నిలిపేయాలని ఎఫ్బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ లేదా మరే ఇతర వ్యక్తిని కోరలేదని స్పష్టం చేసింది. జనరల్ మైకేల్ ఫ్లెన్ దేశ రక్షణ కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేసింది. కాగా, న్యూయార్క్ టైమ్స్ తో పాటు వాషింగ్టన్ పోస్ట్ వంటి అమెరికా ప్రధాన పత్రికల్లో ట్రంప్ కు వ్యతిరేకంగా పెద్దఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.