: ప్రస్తుతం అమెరికాలో హాట్ టాపిక్ ఇదే!


అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కు పదవీగండం ఏర్పడిందా? ఆయన తొలగింపుకు సమయం దగ్గరపడిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో చోటుచేసుకున్న పరిణామాలు ట్రంప్ కు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. అమెరికన్‌ మీడియా కథనాలు ట్రంప్ తీరును ఎండగడుతున్నాయి. అధికార దర్పం ప్రదర్శిస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడుతున్నాయి. రష్యా రాయబారితో రహస్య సమాచారం పంచుకున్నానని స్వయంగా ఆయన చేసిన ప్రకటనే ఆయన కొంప ముంచేలా కనిపిస్తోంది. అంతే కాకుండా...ఎఫ్బీఐ డైరెక్టర్ ను తొలగించే ముందు చోటుచేసుకున్న సంఘటన ఒకటి అమెరికాలో చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే... తాజాగా మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్‌ ఫ్లైన్‌ పై విచారణను నిలిపివేయాలని ఎఫ్బీఐ మాజీ డైరెక్టర్‌ జేమ్స్‌ కామీని ట్రంప్‌ కోరారట. ఇందుకు సంబంధించి ట్రంప్, మైకేల్ ఫ్లెన్ మధ్య జరిగిన సంభాషణల వివరాలు కామీ వద్ద ఉన్నాయని, ఆ సంభాషణలపై కామీ రాసుకున్న నోట్స్ ను తాము పూర్తిగా చదివామని న్యూయార్క్‌ టైమ్స్‌ సంచలన వార్తను ప్రచురించింది. ఆ నోట్స్ ను ఓ సోర్స్‌ ద్వారా సంపాదించి చదివామని, అందులో ఫిబ్రవరి 14న జరిగిన ఓ సమావేశంలో కామీని కలుసుకున్న ట్రంప్‌.. 'ఫ్లైన్‌ మంచివాడు, అతనిని వదిలేస్తావని ఆశిస్తున్నా' అంటూ సూచించారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. అంతకు ముందు ట్రంప్ రష్యా రాయబారికి రహస్యాలు చెప్పాడంటూ వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. దీంతో అమెరికాలో ట్రంప్ కు వ్యతిరేకంగా ఆందోళనలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ను అభిశంసన తీర్మానం ద్వారా తొలగించే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. అమెరికాలో ఇదే హాట్ టాపిక్ అని....దీనిపై జోరుగా చర్చ నడుస్తోందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News