: నేడు తెలుగు రాష్ట్రాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత... అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు


పశ్చిమ బంగాళాఖాతంలోని అండమాన్ దీవుల్లో ఏర్పడిన ఉపరిత ఆవర్తనం కారణంగా నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరుగుతుందని హైదరాబాదు వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా దక్షిణ కోస్తాలో వేడి తీవ్రత అధికంగా ఉంటుందని వారు హెచ్చరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు ఉష్ణోగ్రత 42 డిగ్రీలను తాకుతుందని, దీంతో అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఉదయం 10 గంటల తరువాత, సాయంత్రం 5 గంటలలోపు సూర్యుడి వేడిమికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. పగలు ఉష్ణోగ్రతలు భరింపరానివిగా ఉంటాయని, ఈ ప్రమాదం మరో మూడు రోజులపాటు కొనసాగే అవకాశం ఉందని వారు తెలిపారు. పిల్లలు, పెద్దల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు. 

  • Loading...

More Telugu News