: 'వాన్నా క్రై' దాడి లాజరస్ గ్రూప్ పనే... అనుమానం వ్యక్తం చేస్తున్న సైబర్ నిపుణులు


ప్రపంచ దేశాలను వణికిస్తున్న 'వాన్నా క్రై ర్యాన్సమ్‌ వేర్‌' ఉత్తరకొరియాకు చెందిన లాజరస్ గ్రూప్ కు సంబంధించినదని గూగుల్ సెక్యూరిటీ రీసెర్చర్ నీల్ మెహతా తెలిపారు. గతంలో లాజరస్‌ గ్రూప్‌ ఇలాంటి వైరస్ నే పంపిందని నీల్ మెహతా తెలిపారు. అలా అనుమానించడానికి కారణం... వాన్నా క్రై సాఫ్ట్‌ వేర్‌ కు గతంలో లాజరస్‌ సృష్టించిన హ్యాకింగ్‌ టూల్స్‌ కు మధ్య పోలికలు ఉన్నాయని తెలిపారు. ఒరిజినల్‌ వాన్నా క్రై కోడ్‌ లోని అంకెలు, అక్షరాలతో పాటు డబ్బు చెల్లించాలన్న హెచ్చరికల్లోని ఇంగ్లిష్‌ పద ప్రయోగం చూస్తే... వేరే భాషలో రాసిన వాక్యాలను కంప్యూటర్ సాయంతో తర్జుమా చేసినట్టు స్పష్టంగా అర్ధమవుతుందని అలన్‌ వుడ్‌ వర్డ్‌ అభిప్రాయపడ్డారు.

ఈ లెక్కన లాజరస్ గ్రూపే ఈ పని చేసి ఉంటుందని వారు స్పష్టంగా పేర్కొన్నారు. కాగా, వాన్నా క్రై ర్యాన్సమ్‌ వేర్‌ తో ప్రపంచ దేశాలపై సైబర్ దాడికి దిగిన వాన్నా క్రై హ్యాకర్లు బిట్ కాయిన్ రూపంలో డబ్బు చెల్లించాలని డిమాండ్ చేసినప్పటికీ ఎవరూ పెద్దగా స్పందించలేదని, దీంతో వారు కేవలం 60 వేల డాలర్లు మాత్రమే వసూలు చేయగలిగారని బిట్‌ కాయిన్‌ సంస్థ ప్రకటించింది. కాగా, దీని ప్రభావం భారత్ లో పెద్దగా లేదని నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News