: హైదరాబాదులో బోల్తా పడ్డ కారు... ఇద్దరమ్మాయిలకు గాయాలు
హైదరాబాదులో ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదం జరిగింది. పూటుగా మద్యం సేవించిన ఓ యువకుడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బెంబేెలెత్తించాడు. ఈ క్రమంలో రాంగ్ సైడ్ లోకి దూసుకొచ్చి అడ్డదిడ్డంగా వాహనం నడుపుతుండగా, వేగంగా దూసుకొచ్చిన మరో కారు వెనుక నుంచి దీనిని ఢీ కొట్టింది. దీంతో తాగుబోతు డ్రైవ్ చేస్తున్న కారు పల్టీలు కొట్టింది. ఈ క్రమంలో ఆ కారు ఓ పాదచారిని ఢీ కొట్టింది. సదరు కారు పల్టీలు కొట్టడంతో అందులో యువకుడితో పాటు ప్రయాణిస్తున్న ఇద్దరు యువతులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు, నిందితుడిపై కేసు నమోదు చేశారు.