: 'పొలిటికల్ పంచ్' రవికిరణ్‌కు బెయిలు.. మరో కేసులో జైల్లోనే..!
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిపై అసభ్య పోస్టులు పెట్టిన కేసులో అరెస్టయిన ‘పొలిటికల్ పంచ్’ రవికిరణ్‌కు బెయిలు లభించింది. అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు రవికిరణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి గుంటూరు సబ్‌జైలుకు తరలించారు. మంగళవారం రవికిరణ్‌కు మంగళగిరి కోర్టు బెయిలు మంజూరు చేసింది. అయితే మరో కేసులో ఆయనకు బెయిలు రావాల్సి ఉండడంతో రవికిరణ్ జైలులోనే ఉండాల్సి వచ్చింది.
తనపై పొలిటికల్ పంచ్ రవికిరణ్ అసభ్యకరంగా పోస్టులు పెట్టారంటూ విశాఖపట్టణం జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనకు బెయిలు రావాల్సి ఉంది. కాగా, మంగళవారం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జైలుకు వెళ్లి రవికిరణ్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని, అక్రమ కేసులు బనాయించిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.