: ప్రతీకారం తీర్చుకున్నారు... 20 మంది మావోలను మట్టుబెట్టారు!


ఛత్తీస్‌ గఢ్‌ లోని సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లను మట్టుబెట్టిన ఘటనకు ప్రతీకారం తీర్చుకున్నారు. మావోలపై సీఆర్పీఎఫ్, కోబ్రా దళాలు గట్టి దెబ్బకొట్టాయి. బీజాపూర్‌, రాయఘడ జిల్లాలలోని అటవీ ప్రాంతం పరిధిలో సీఆర్‌పీఎఫ్‌, కోబ్రా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సమయంలో సీఆర్పీఎఫ్ దళాలను ఏమార్చేందుకు కోబ్రా దళాలు ధరించే యూనిఫాం దుస్తులనే మావోలు ధరించినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే వారు మావోయిస్టులని గుర్తించిన సీఆర్పీఎఫ్, కోబ్రా దళాలు వారిపై విరుచుకుపడ్డాయి. దీంతో, ఎదురు కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు హతమయ్యారని తెలుస్తోంది. మావోలను ఏరివేసేందుకు 350 మంది సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు, కోబ్రా దళాలు కూడా పాలుపంచుకున్నాయని సమాచారం. 

  • Loading...

More Telugu News